దిశ ఎఫెక్ట్.. రైతులను మోసగించే వారిపై చర్యలు

by Web Desk |
దిశ ఎఫెక్ట్.. రైతులను మోసగించే వారిపై చర్యలు
X

దిశ ప్రతినిధి, సిద్దిపేట: రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తూ మోసగించే విత్తన, ఎరువుల దుకాణాల యజమానులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ హెచ్చరించారు. ఆదివారం నకిలీల కలకలం.. 'కన్నెత్తి చూడని అధికారులు' పేరిట 'దిశ' ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన జిల్లా వ్యవసాయ అధికారి తన సిబ్బందికి ఫెర్టిలైజర్, సీడ్ షాపుల్లో తనిఖీలు చేయాలని ఆదేశించారు. దీంతో వ్యవసాయ అధికారులు సిద్దిపేట మండల వ్యాప్తంగా అన్ని షాపుల్లో తనిఖీలు చేపట్టారు.




ఈ సందర్భంగా ఏవో శ్రవణ్ కుమార్ 'దిశ' ప్రతినిధితో మాట్లాడారు. జిల్లాలో నిరంతరంగా షాపులను తనిఖీ చేస్తామని చెప్పారు. రైతులకు ఎలాంటి అనుమానం వచ్చిన వెంటనే స్థానిక వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయొచ్చన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మినట్టు తేలితే ఆ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏఈవో లు తమ పరిధిలోని షాపులని నిరంతరం గా తనిఖీలు చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. రిజిస్టర్ మెయింటెనెన్స్ సరిగా లేకున్నా.. స్టాక్ వివరాలు తెలపకున్న అట్టి షాప్ పై చర్యలు తీసుకోవాలని ఏఈవో లకు సూచించామన్నారు.

Next Story

Most Viewed