కోడ్ ఉల్లంఘన.. నగరి టీడీపీ అభ్యర్థిపై కేసు

by srinivas |
కోడ్ ఉల్లంఘన.. నగరి టీడీపీ అభ్యర్థిపై కేసు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే రాష్ట్రంలో ఇంకా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పలుచోట్ల 144 సెక్షన్ కొనసాగుతోంది. కోడ్ అమల్లో ఉండగా అభ్యర్థులు ఎలాంటి ప్రచారాలు గానీ, కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలకు హాజరుకాకూడని ఎన్నికల నిబంధనలో ఉంది. అభ్యర్థులకు సంబంధించి ఎలాంటి ఫ్లెక్సీలు , పోస్టర్లు కనిపించకూడదని ఈసీ ఆదేశాలున్నాయి.

అయితే నగరిలో ఈసీ ఆదేశాలను బేఖాతరు చేశారు. టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ కోడ్ ఉల్లంఘించారు. ఎన్నికల ఫలితాలు రాకుండానే ఈసీ నిబంధనలకు వ్యతిరేకంగా గాలి భాను ప్రకాశ్ ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. చిత్తూరులో బ్యాడ్మింటన్ కోర్టు ప్రాంగణాన్ని భానుప్రకాశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గాలి భానుప్రకాశ్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే భాను ప్రకాశ్ అంటూ ఫ్లెక్సీల్లో ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలపై ఎమ్మెల్యే రోజా వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పరిగణిస్తూ గాలి భాను ప్రకాశ్‌పై కేసు నమోదు చేశారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు.

Next Story