- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిజిటల్ క్రాప్ సర్వే కేంద్ర, రాష్ట్ర పథకాల అమలుకు ఉపకరిస్తుంది : సి ఎస్ రామకృష్ణారావు
రాష్ట్రంలో డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియను మార్చి 15వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియను మార్చి 15వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుడు, అగ్రిస్టాక్ చీఫ్ నాలెడ్జ్ ఆఫీసర్ రాజీవ్ చావ్లా అధ్యక్షతన జరిగిన సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేశ్‌కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ స్పెషల్ సెక్రెటరి రాజీవ్‌గాంధీ హన్మంతు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ తాము సూచించిన గడువులోగా డిసిఎస్ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎన్ ఐ సి అధికారుల సహకారంతో సర్వేను పూర్తి చేయాలని సూచించారు.
సీజినల్ డిజిటల్ క్రాప్ సర్వేతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలకు ఉపకరిస్తుందని, అదేవిధంగా స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి(జిఎస్‌డిపి) గణాంకాలకు ఈ సర్వే ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 10, 877 గ్రామాల్లో డిసిఎస్ సర్వే చేపట్టడం జరిగిందని అధికారులు తెలిపారు. దేశంలోని యుపి, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్నాటక, ఒడిశా తదితర రాష్ట్రాల్లో డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియ పూర్తి అయిందని కేంద్ర ప్రభుత్వ సలహాదారుడు రాజీవ్ చావ్లా వెల్లడించారు. అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వ్యవసాయశాఖ సంచాలకులు గోపి ఇప్పటి వరకు చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే వివరాలను ఉన్నతాధికారులకు వివరించారు.






