ఓపెన్ స్కూల్‌ను సందర్శించిన రాష్ట్ర కో-ఆర్డినేటర్

by Dishafeatures2 |
ఓపెన్ స్కూల్‌ను సందర్శించిన రాష్ట్ర కో-ఆర్డినేటర్
X

దిశ, చిన్నశంకరంపేట: ఓపెన్ స్కూల్ వరంలాంటిదని లాస్ట్ ఓపెన్ స్కూల్ సొసైటీ స్టేట్ కోఆర్డినేటర్ బి పద్మ దేవి అన్నారు. ఆదివారం చిన్న శంకరం పేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓపెన్ స్కూల్‌ను సందర్శించారు. అసిస్టెంట్ కోఆర్డినేటర్ నాగరాజు ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశారు. పదవ, ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ వివిధ రకాల విద్యార్థులు మధ్యలో మానేసిన వారి కోసం ప్రభుత్వం స్కూల్ సొసైటీ ద్వారా ఉన్నత చదువులు చదివేందుకు అవకాశం కల్పించిందని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఆదివారం తరగతి గదులకు విద్యార్థులు తప్పక రావాలని సూచించారు. ఇప్పటివరకు ఓపెన్ స్కూల్ లో చదివిన వారు ఉద్యోగులుగా పొందాలని ఆమె సూచించారు. ఓపెన్ స్కూల్, రెగ్యులర్ చదువుతున్న విద్యార్థులకు పదో తరగతి ఉత్తీర్ణత మేమో ఒకటేనని ఈ విషయం గమనించగలరు అని తెలిపారు.

పాఠశాలలో పలు రికార్డులను పరిశీలన

పాఠశాలలో విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్, ఉపాధ్యాయ రిజిస్టర్‌లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఓపెన్ స్కూల్ తరగతులకు 50 మంది విద్యార్థులు హాజరు కావడంతో రాష్ట్ర కో-ఆర్డినేటర్ పద్మ దేవి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల హాజరు శాతం పెంచాలని అసైన్మెంట్ ఇవ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు. వీరితోపాటు ఓపెన్ స్కూల్ ఉపాధ్యాయులు పాఠశాల కోఆర్డినేటర్ విశ్వనాథం, అసిస్టెంట్ కోఆర్డినేటర్ నాగరాజు, చంద్రం, శ్రీకాంత్, జలజ సుధా రాములు ఇలియాస్ రాజ్ కుమార్ ఇలియాస్ ఉన్నారు.



Next Story