- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పదేళ్లుగా పని మనిషిపై అత్యాచారం.. ‘ధురంధర్’ నటుడు అరెస్ట్
బాలీవుడ్ మూవీ ఇండస్ట్రీ మరోసారి ఉలిక్కిపడింది.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ (Bollywood) మూవీ ఇండస్ట్రీ మరోసారి ఉలిక్కిపడింది. ప్రముఖ నటుడు నదీమ్ ఖాన్ (Nadeem Khan)ను లైంగిక వేధింపుల ఆరోపణలపై ముంబై పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం మేరకు నదీమ్ ఖాన్ ఇంట్లో పనిచేసే మహిళ ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసింది. గత 10 ఏళ్లుగా నదీమ్ ఖాన్ తనపై వరుసగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
ఇన్నాళ్లూ తనపై జరుగుతున్న దౌర్జన్యాన్ని భరిస్తూ మౌనంగా ఉండటానికి కారణం నటుడు ఇచ్చిన హామీయేనని బాధిత మహిళ తెలిపింది. తనను పెళ్లి చేసుకుంటానని నదీమ్ ఖాన్ నమ్మించాడని, ఆ నమ్మకంతోనే తాను ఇన్నాళ్లూ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, చివరకు తాను మోసపోయానని గ్రహించిన సదరు మహిళ పోలీసులను ఆశ్రయించినట్లుగా మీడియాకు తెలిపింది. సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదును మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నదీమ్ ఖాన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.






