తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల నిరీక్షణ

by Kema Shiva Kumar |

ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల నిరీక్షణ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తిరుమల కొండపై ఉన్న వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులు వెలుపల ఉన్న క్యూ లైన్లలో కిలో మీటర్ల మేర వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది.

మరోవైపు ఎండను సైతం లెక్కచేయకుండా భక్తులు క్యూ లైన్లలో నిలబడి ‘గోవింద’ నామస్మరణతో వేచి చూస్తున్నారు. శుక్రవారం స్వామి వారిని 69,726 మంది భక్తులు దర్శింకోగా.. 27,832 మంది తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం రూ.4.12 కోట్లు వచ్చిందని టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు. రద్దీ ఎక్కువగా ఉన్న దృష్ట్యా, క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు టీటీడీ సిబ్బంది నిరంతరాయంగా పాలు, తాగునీరు అన్న ప్రసాదాలను నిర్విరామంగా పంపిణీ చేస్తున్నారు. భక్తులు ఓపికతో వ్యవహరించాలని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.

Next Story