- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలపై వ్యక్తిత్వ హననం ఆమోదయోగ్యం కాదు: సీపీ సజ్జనార్
ఐఏఎస్ అధికారిణిపై అవాస్తవాలను ప్రచారం చేసిన కేసులో తెలంగాణలో వరుస అరెస్టులు జరగడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఐఏఎస్ అధికారిణిపై అవాస్తవాలను ప్రచారం చేసిన కేసులో తెలంగాణలో వరుస అరెస్టులు జరగడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందులో "సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటూ నాయకత్వ బాధ్యతలు చేపట్టడం మనం చూస్తున్నాం. పాలన, పోలీసింగ్, సైన్స్, మీడియా వంటి రంగాలతో పాటు కుటుంబ బాధ్యతలను కూడా వారు ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అయితే, విమర్శ పేరుతో మహిళా అధికారులను, ఉద్యోగినులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో, టీవీ చానెళ్లలో వారి వ్యక్తిత్వాన్ని కించపరచడం విమర్శ కాదని, అది ముమ్మాటికీ క్రూరత్వమేనని మేధావులు హెచ్చరిస్తున్నారు.
పబ్లిక్ లైఫ్ లో ఉన్న వారికి విమర్శలు సహజమే అయినప్పటికీ, మహిళల క్యారెక్టర్‌ను అటాక్ చేయడం సభ్య సమాజానికి గొడ్డలి పెట్టు వంటిది" మన పురాతన ధర్మం "యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః" (ఎక్కడ మహిళలు పూజించబడతారో, అక్కడ దేవతలు కొలువై ఉంటారు) అని చెబుతోంది. కానీ నేటి కాలంలో మహిళా అధికారులపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న వ్యక్తిత్వ హననం (Character Assassination) మన నాగరికతనే ప్రశ్నిస్తోంది. మహిళా సాధికారత, ప్రగతి గురించి మాట్లాడుకునే మనం, వారిని అవమానించే ధోరణిని ఏమాత్రం సహించకూడదు. మహిళల గౌరవాన్ని కాపాడలేని సమాజం తన సొంత భవిష్యత్తును తానే పాడుచేసుకుంటుందని, 'భవిష్యత్తు మహిళలదే' అన్న స్పృహతో ప్రతి ఒక్కరూ ఇలాంటి దాడులను ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని సీపీ సజ్జనార్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.






