ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్ర పోలీసు ఉద్యోగాల్లో మాజీ అగ్నివీర్లకు 20% రిజర్వ్

by Malleboina Mahesh |

మాజీ అగ్నివీర్లకు ఢిల్లీ పోలీసు ఉద్యోగాల్లో 20% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం. వయోపరిమితి సడలింపుతో పాటు శారీరక పరీక్షల నుండి మినహాయింపు.

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్ర పోలీసు ఉద్యోగాల్లో మాజీ అగ్నివీర్లకు 20% రిజర్వ్
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఢిల్లీ పోలీసు శాఖలోని తమ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులలో 20 శాతాన్ని మాజీ అగ్నివీర్‌ల (ex-Agniveers)కు రిజర్వ్ చేయనున్నారు. వీరికి శారీరక సామర్థ్య పరీక్ష నుంచి మినహాయింపు తో పాటు, గరిష్ట వయోపరిమితిలో సడలింపు కూడా ఇవ్వనున్నారు. అలాగే సాయుధ దళాలలో నాలుగేళ్ల పదవి కాలం తర్వాత అగ్నివీర్‌లను భద్రతా దళాలలోకి చేర్చుకోవాలన్న కేంద్రం యొక్క విస్తృత ప్రణాళికకు అనుగుణంగా, దళం యొక్క నియామక విధానాన్ని అధికారికం చేస్తూ, శుక్రవారం జారీ చేయబడిన ఢిల్లీ పోలీస్ శాఖ (Delhi Police Department) నిబంధనలు, 1980కి చేసిన సవరణలలో భాగంగా ఈ చర్య తీసుకున్నారు. దీనికి సంబంధించిన రాత పరీక్షలు, శారీరక అర్హతలు సహా నియామక పరీక్షలను నిర్వహించడానికి వివరణాత్మక విధానాలను పోలీస్ కమిషనర్ విడిగా జారీ చేయనున్నట్లు ఢిల్లీ పోలీస్ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయం మాజీ అగ్ని వీరులతో పాటు, కొత్తగా ఢిల్లీ నుంచి అగ్ని వీరులుగా వెళ్లాలనుకునే యువతకు ఎంతో మేలు చేయనుంది.

Next Story