హోళీ వేడుకల్లో విషాదం.. డ్యాన్స్ చేస్తూ తనకు తానే పొడుచుకున్న యువకుడు (వీడియో)

by Dishanational1 |
హోళీ వేడుకల్లో విషాదం.. డ్యాన్స్ చేస్తూ తనకు తానే పొడుచుకున్న యువకుడు (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ లో కొంతమంది యువకులు నిర్వహించిన హోళీ వేడుకుల్లో విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు తనకు తానే కత్తితో పొడుచుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరలవుతోంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కొంతమంది వ్యక్తులు హోళీ వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో ఆ యువకులు మద్యం మత్తులో డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. అయితే, అందులో ఓ యువకుడు డ్యాన్స్ చేస్తూ కత్తితో తనకు తానే పొడుచుకున్నాడు. అది గమనించిన స్థానికులు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు అందులో పేర్కొన్నారు.



Next Story

Most Viewed