ఉద్యోగ ఖాళీల భర్తీపై కసరత్తు షురూ

by Disha Web Desk |
telangana cs somesh kumar focus on multilevel avenue plantation
X

దిశ, తెలంగాణ బ్యూరో : వివిధ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న 80 వేలకు పైగా పోస్టుల భర్తీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో కసరత్తు మొదలైంది. ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖలతో పాటు విద్య, వైద్యం, హోం శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులతో సచివాలయంలో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల్లో ఏ కేడర్ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయో వివరాలను తెలుసుకుని వాటిని భర్తీ చేయడానికి అనుసరించాల్సిన ప్రాతిపదిక, నియామక ప్రక్రియ తదితరాలపై సీఎస్ చర్చించారు. వీలైనంత తొందరగా నోటిఫికేషన్లను జారీ చేయడంపై సమాలోచనలు జరిగాయి.

కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం మొత్తం 80 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నందున దానికి తొలుత ఆర్థిక శాఖ నుంచి అనుమతి మంజూరయ్యే ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంటుంది. ఆయా శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులు, వాటి కేడర్ తదితరాలపై చర్చించి రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను శాఖాపరంగా నిర్వహించడమా లేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి సంస్థల ద్వారా చేయడమా తదితర అంశాలపైన లోతుగా చర్చించినట్లు తెలిసింది. ఈ శాఖల ఉన్నతాధికారుల అందించే వివరాలకు అనుగుణంగా ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుని ఆర్థికపరమైన అనుమతులను మంజూరు చేయడంపై ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత తొందరగా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేయడంపై సీఎస్ దృష్టి పెట్టారు.

Next Story

Most Viewed