- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాయిలెట్స్ డోర్స్ పై ఛత్రపతి శివాజీ, రాణీ పద్మిని బొమ్మల వివాదం
హర్యానాలో టాయిలెట్స్ డోర్స్ మీద ఛత్రపతి శివాజీ, రాణి పద్మినిని పోలిన బొమ్మలు ఉపయోగించడంపై తీవ్ర వివాదం నెలకొంది.

దిశ, వెబ్ డెస్క్ : టాయిలెట్స్ డోర్స్ పై ఛత్రపతి శివాజీ, రాణీ పద్మిని బొమ్మలను ఉపయోగించడంపై ప్రస్తుతం తీవ్ర వివాదం రేగుతోంది. హర్యానాలోని సిక్రీ ప్రాంతంలో ఉన్న మిలన్ బ్యాంక్వెట్ హాల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ హాల్‌లోని వాష్‌రూమ్ తలుపులపై "హి" మరియు "షీ" గుర్తుల స్థానంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు రాణి పద్మినిని పోలిన చిత్రాలను ఉపయోగించడం ఈ వివాదానికి కారణం అయింది. ఈ విషయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అనేక మంది ఇది హిందూ సమాజ గౌరవానికి, దేశ చరిత్రలో గొప్ప స్థానమున్న చారిత్రక వ్యక్తులకు అవమానంగా భావిస్తూ.. తీవ్రంగా ఖండిస్తున్నారు.
వివాదం పెద్దది కావడంతో బ్యాంక్వెట్ హాల్ యాజమాన్యం స్పందించింది. తమకు ఎవరినీ అవమానించే ఉద్దేశ్యం లేదని తెలిపింది. ఆ చిత్రాలు ఛత్రపతి శివాజీ మహారాజ్, రాణి పద్మినిని పోలి ఉండటం పూర్తిగా యాదృచ్ఛికమని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని, సాధారణ చిత్రాలను అపార్థం చేసుకొని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని స్పష్టం చేసింది. తమకు ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం లేదని, జరిగిన ఘటనకు ఎవరైనా నొచ్చుకొని ఉంటే క్షమాపణలు అని తెలిపింది. అయితే ఈ బాంక్వెట్ హాల్ అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే సోదరుడికి చెందిందని, అందుకే ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా దేశ చరిత్రలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల చిత్రాలను ఉపయోగించే విషయంలో మరింత జాగ్రత్త అవసరమని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం.






