సీఎం విజయ్ తో సెల్ఫీ వీడియో.. వివాదం

by Muthe.Rajitha |

తమిళనాడు నూతన సీఎం విజయ్‌ను కలిసిన సందర్భంగా దివ్యాంగుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సిమ్మచంద్రన్‌ సెల్ఫీ వీడియో తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సీఎం విజయ్ తో సెల్ఫీ వీడియో.. వివాదం
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు నూతన సీఎం జోసెఫ్ విజయ్‌ను (Thalapathy Vijay) కలిసిన సందర్భంగా దివ్యాంగుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సిమ్మచంద్రన్‌ సెల్ఫీ వీడియో తీసుకోవడం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి సచివాలయంలో ప్రభుత్వ ఉన్నతాధికారులతో అత్యంత కీలకమైన అధికారిక సమాలోచనలు నిర్వహిస్తున్న సమయంలో, నిబంధనలకు విరుద్ధంగా ఈ సెల్ఫీ వీడియోను చిత్రీకరించి నెట్‌లో పోస్ట్ చేశారనే ప్రచారం జరగడంతో ఈ వివాదం మొదలైంది. ఈ విషయంపై సిమ్మచంద్రన్ క్లారిటీ ఇస్తూ.. తాను గత 35 సంవత్సరాలుగా దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతూ ఎందరో ముఖ్యమంత్రులను, మంత్రులను కలిశానని గుర్తుచేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రిని కలవాలన్నా ఒక రకమైన భయం, ఆందోళనతోనే మాట్లాడేవాళ్లమని ఆయన పేర్కొన్నారు.

అయితే కొత్త సీఎం జోసెఫ్ విజయ్‌ను కలిసినప్పుడు మాత్రం తమకు ఎక్కడా అలాంటి భయం కలగలేదని, ఆయన చూపించిన ఆత్మీయత వల్ల తాము ఎంతో సౌకర్యంగా ఫీల్ అయ్యామని తెలిపారు. ఈ వివాదానికి కారణమైన సెల్ఫీ వీడియో గురించి ప్రస్తావిస్తూ.. తాను మొబైల్ తీసి వీడియో రికార్డ్ చేస్తున్న విషయం ముఖ్యమంత్రికి ముందే తెలుసని, దానికి ఆయన ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఎంతో సానుకూలంగా స్పందించారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వారించనప్పటికీ, అక్కడే ఉన్న సమాచార, పౌర సంబంధాల అధికారులు మాత్రం ప్రోటోకాల్ నిబంధనల దృష్ట్యా తనను ప్రశ్నించారని ఆయన వివరించారు.

Next Story