- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతర్జాతీయ వేదికపై కాంగ్రెస్రాజకీయ నాటకాలు తగవు: కేటీఆర్
"అంతర్జాతీయ ఏఐ సమ్మిట్‌ను రాజకీయ నిరసనలకు వేదికగా మార్చి దేశ ప్రతిష్టను దెబ్బతీయడం విచారకరమని కేటీఆర్ విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: యూత్ కాంగ్రెస్ సభ్యులు తమ అల్ప రాజకీయ నాటకాల కోసం ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ను వేదికగా ఎంచుకోవడం అత్యంత విచారకరమని బీఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్కె. తారక రామారావు పేర్కొన్నారు. ఇలాంటి అంతర్జాతీయ వేదికలను నిరసనల కోసం ఉపయోగించడంతో ప్రపంచ దేశాల ముందు మన దేశం ప్రతిష్ట దెబ్బతింటుందన్నారు. శనివారం ఎక్స్‌వేదికగా స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే, ఎక్కడ ఎలా నిరసన తెలపాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు. రాజకీయ అసమ్మతిని వ్యక్తం చేయడానికి ఒక సమయం, సందర్భం ఉంటాయని ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వంటి అంతర్జాతీయ సదస్సు ఖచ్చితంగా దానికి వేదిక కాదు అన్నారు. కాంగ్రెస్‌పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే యూత్ కాంగ్రెస్ నాయకులు ఈ నిరసన చేపట్టడం విచిత్రంగా ఉందన్నారు.
రేవంత్ సర్కార్ చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్ఎల్‌బీసీ దుర్ఘటన
ఎస్ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలి ఏడాది కావొస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. అయిన వారిని కనీసం చివరి చూపు చూసే అవకాశం లేకుండా కార్మికుల కుటుంబాలకు మానసిక క్షోభకు గురి చేసింది. సంవత్సరం గడుస్తున్న మృతదేహాల వెలికితీతలో కానీ సొరంగం పనుల్లో కానీ ఎటువంటి పురోగతి లేకపోవడం రేవంత్ నిర్లక్ష్యానికి, చేతకానితనానికి నిదర్శనం. కాంగ్రెస్ నాయకులు కమీషన్లు, కాంట్రాక్టులు, వాటాలపై పెట్టే శ్రద్ధ, ఇకనైనా కార్మిక సంక్షేమం మీద, ప్రజా శ్రేయస్సు మీద పెడితే ఇటువంటి విషాదాలు పునరావృతం కావన్నారు.






