National Herald Case: ప్రధాని మోడీ, అమిత్ షాపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
Congress Not Scared of Modi, will not be intimidated Says Rahul Gandhi on National Herald Case
X

దిశ, వెబ్‌డెస్క్: Congress Not Scared of Modi, will not be intimidated Says Rahul Gandhi on National Herald Case| యంగ్ ఇండియన్ కార్యాలయాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీల్ చేసిన అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాను టార్గెట్‌గా చేసుకుని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. కేంద్రం దర్యాప్తు సంస్థల ద్వారా బెదిరించాలని ప్రయత్నిస్తోందని అన్నారు. తమపై ఒత్తిడి తీసుకొస్తే తాము మౌనంగా ఉంటామని భావిస్తున్నారని దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, దేశంలో సామరస్యాన్ని కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తాను. వారు ఏది చేసినా నేను నా పనిని కొనసాగిస్తానని అన్నారు. మేం బెదిరిపోమని, నరేంద్ర మోడీకి భయపడేది లేదన్నారు. నన్ను ఎవరూ ఆపలేరని చెప్పారు. కాగా నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియాను ఇప్పటికే ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో యంగ్ ఇండియన్ కార్యాలయాన్ని ఈడీ సీల్ చేసింది. ఏజెన్సీ అనుమతి లేకుండా ప్రాంగణాన్ని తెరవరాదని పేర్కొంది. ఈ నేపథ్యంలో స్పందించిన రాహుల్ గాంధీ మోడీ చర్యలకు భయపడబోయేది లేదని అన్నారు.

ఇది కూడా చదవండి: Supreme Court ప్రధాన న్యాయమూర్తిగా UU Lalit

Next Story