- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ అయితే ఏంటి.. చట్టం ముందు అందరూ సమానమే: కాంగ్రెస్ MP
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)కు సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులపై కాంగ్రెస్ ఎంపీ మల్లు(Mallu Ravi) రవి స్పందించారు. కేసీఆర్‌పై కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు అర్థం లేదు. చట్టం ముందు అందరూ సమానమే అని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్‌లు జరిగాయి.. దీనికి ఆయన కూడా బాధ్యుడే.. ఫోన్‌లు ట్యాపింగ్ చేయడానికి అనుమతి ఇచ్చారో లేదో ఆనాటి ముఖ్యమంత్రిగా ప్రజలకు నిజం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్‌పై ఉందని అన్నారు. సిట్ అడిగిన ప్రతీ ప్రశ్నకు కేసీఆర్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడానికే కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చిందని మల్లు రవి స్పష్టం చేశారు. కాగా, ఇవాళ ఉదయం బంజారాహిల్స్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆయన కుటుంబసభ్యులకు నోటీసులు అందజేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు (శుక్రవారం) విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులలో కోరారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అధికారులు కేసీఆర్‌ను విచారించనున్నారు. విచారణకు సిద్ధంగా ఉండాలని సూచించారు. వయసురీత్యా విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని, మీరు కోరిన చోటే విచారిస్తామని కేసీఆర్‌కు తెలిపారు.






