- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నా అయ్య, నా అన్న ఇద్దరూ కమ్యూనిస్టులే’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
ఖమ్మంలో జరిగిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పాల్గొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మంలో జరిగిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజానికి కమ్యూనిస్టుల అవసరం ఎంతో ఉన్నదని అన్నారు. దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాటాలు చేసినంతగా మరెవరూ చేయలేరని తెలిపారు. ‘అయ్య కమ్యూనిస్ట్.. మా అన్న కమ్యూనిస్ట్.. వారి వారసుడిగా ఇవాళ నేను కమ్మం సభకు వచ్చాను’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టులు లేని రాజ్యాన్ని ఊహించుకోలేమని అన్నారు. కమ్యూనిస్టులు అవసరం కాదు.. అనివార్యం అని చెప్పారు. ఎర్రజెండా కలకాలం వర్ధిల్లాలని అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా విప్లవకారుడే అని.. ఆయనలో బయటకు కనిపించని విప్లవకారుడు ఉన్నాడని మందుల సామేల్ చెప్పుకొచ్చారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఎర్రజెండా నిటారుగా నిలబడి కొట్లాడుతోంది. కామ్రేడ్ సోదరులను నేను మనసారా అభినందిస్తున్నాను. 1925 డిసెంబర్ యూపీలోని కాన్పూర్‌లో ప్రారంభించిన కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది. రాబోయే వందేళ్లు కూడా పేదలు, గిరిజనుల కోసం కొట్లాడుతాం. అవసరమైతే తుదిశ్వాశ వదులుతామే తప్ప ఎర్రజెండాను మాత్రం వదలం అనడానికి ఖమ్మం శతాబ్ది ఉత్సవాలే నిదర్శనం. కమ్యూనిస్టులను ఆదర్శంగా తీసుకుని పాశవికంగా ప్రవర్తిస్తున్న కొన్ని ప్రభుత్వాలను పడగొట్టాం' అని సీఎం రేవంత్ అన్నారు.






