ముస్లింలను ఓటు బ్యాంకులా చూస్తున్న కాంగ్రెస్ : తలసాని శ్రీనివాస్

by Muthe.Rajitha |

కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఓటు బ్యాంకులా చూస్తోందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.

ముస్లింలను ఓటు బ్యాంకులా చూస్తున్న కాంగ్రెస్ : తలసాని శ్రీనివాస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను ఓటు బ్యాంకులా చూస్తున్నదని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. బుధవారం మోండా డివిజన్‌లోని ఇస్లామియా మజీద్‌లో ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం రోజా చేపట్టిన ముస్లింలకు పండ్లు తినిపించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. ఇఫ్తార్ ఏర్పాటు చేసిన ఆయూబ్, ఆసీఫ్‌లను అభినందించారు. కేసీఆర్ ప్రభుత్వం రంజాన్ సందర్భంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడమే కాకుండా, రంజాన్ కిట్‌ కింద నూతన దుస్తులను అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు.

అదేవిధంగా రంజాన్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో మసీదులు, ఈద్గాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలను పట్టించుకోవడం లేదని అన్నారు. అమెరికా, ఇరాన్, ఇరాక్ యుద్ధంతో రానున్న రోజులలో సమస్యలు ఏర్పడనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు తలసాని స్కైలాబ్‌యాదవ్, తలసాని శివయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story