మేడారం జాతరలో మంత్రికి అవమానం.. ములుగు SPపై సీఎం రేవంత్‌కు ఫిర్యాదు

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-02 13:48:03  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దళిత సంఘాల నాయకులు భేటీ అయ్యారు.

మేడారం జాతరలో మంత్రికి అవమానం.. ములుగు SPపై సీఎం రేవంత్‌కు ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో దళిత సంఘాల నాయకులు భేటీ అయ్యారు. ములుగు ఎస్పీని సస్పెండ్ చేయాలని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత సతీష్ మాదిగ మాట్లాడుతూ.. మేడారం గిరిజన జాతర(Medaram Jatara)లో దళిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు అవమానం జరిగింది. ములుగు ఎస్పీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై వివక్షత చూపించాడు. ఇతర మంత్రులు అందరికీ భద్రత కల్పించి.. అడ్లూరి లక్ష్మణ్‌కు భద్రత కల్పించలేదు. దీనిపై విచారణ జరిపి ములుగు ఎస్పీ‌పై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

‘మంత్రి దిగి నడిచి పోతుంటే కనీసం కానిస్టేబుల్ కూడా లేడు. ఏదైనా జరకూడనిది జరిగితే ఎవరు బాద్యులు?. సంఘ విద్రోహక శక్తులు మేడారంలో ఎక్కువగా ఉన్నారు. అసలు ములుగు ఎస్పీ ఎందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు ఎందుకు భద్రత కల్పించలేదు. మేడారంలో మూడు అంచెల విధానంలో నాలుగు వేల మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. కానీ మంత్రిని మాత్రం ఎక్కరూ పట్టించుకోలేదు’ అని సతీష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story