TG: రాష్ట్రంలో స్వల్పంగా పెరిగిన చలి

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో వాతావరణం వేగంగా మారుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత స్వల్పంగా పెరిగినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

TG: రాష్ట్రంలో స్వల్పంగా పెరిగిన చలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వాతావరణం వేగంగా మారుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత స్వల్పంగా పెరిగినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉదయం, రాత్రి సమయాల్లో పొగమంచు ప్రభావం అధికంగా ఉంటోంది, దీనివల్ల వాహనదారులు ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ర్టంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కుమరం భీం జిల్లా సిర్పూర్‌లో 9.8 డిగ్రీ సెల్సియస్ గా నమోదైంది. ఇంకా సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 9.8, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో 9.7, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉప్పల్ లో 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా తక్కువ ఎత్తులో ఆగ్నేయ, తూర్పు గాలులు వీస్తుండటమే ఈ చలి తీవ్రత పెరగడానికి ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. రాబోయే మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. తూర్పు నుంచి వీస్తున్న గాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో గాలుల్లో తేమ శాతం పెరగడం వల్ల ఉదయం వేళల్లో అక్కడక్కడా పొగమంచు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

Next Story