- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Phone Tapping Case: కేసీఆర్ విచారణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) విచారణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని రావి నారాయణ రెడ్డి మెమోరియల్ ఆడిటోరియంలో ప్రతిష్టాత్మక 'రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు-2025' ప్రదానోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉంది. ఈ కేసులో ఆయనను విచారించడానికి సిట్ అధికారులు నోటీసులు ఇస్తే.. తెలంగాణ జాతిపితకే నోటీసులు ఇస్తారా? అంటున్నారు.. పదేళ్లు తెలంగాణ ప్రజలను విస్మరించన వాళ్లు, ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేసిన వారు జాతిపితలు ఎలా అవుతారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజమైన తెలంగాణ జాతిపిత అయితే దేనికి ఆదర్శం అని అడిగారు. ప్రొఫెసర్ కోదండరామ్ ఉద్యమకారుడు కాదా? అని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇబ్బందిపడని ఉద్యమకారుడు లేడని గుర్తుచేశారు. అరెస్టులు చేసి వేధించారని అన్నారు. ఇళ్ల తలుపులు బద్దలు కొట్టి.. బెడ్ రూమ్‌ల నుంచి ఈడ్చుకెళ్లిన ఘటనలు ఉన్నాయని గుర్తుచేశారు. ఇప్పుడు అవేమీ కనిపించడం లేదని చెప్పారు.
చేసిన తప్పులకే నోటీసులు ఇచ్చారు. ఎక్కడ ఉంటే అక్కడికే వచ్చి విచారణ చేయాలనడం కరెక్ట్ కాదు. నేరాలు చేస్తాం.. విచారించొద్దు అంటే ఎలా అని సీఎం రేవంత్ రెడ్డి అడిగారు. అక్రమాలకు పాల్పడిన ఎవరైనా విచారణను ఎదుర్కోవాల్సిందే అని అన్నారు. వచ్చిన తెలంగాణలో పదవులన్నీ కేసీఆర్ కుటుంబ సభ్యులే పంచుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.






