- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరంజీవి సినిమా ఇండస్ట్రీ హిట్.. చిత్రబృందం అధికారిక ప్రకటన
సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది.

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా(Mana Shankara Vara Prasad Garu Movie) రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది. విడుదలైన ఆరు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించడమే గాకుండా.. 11 రోజుల్లోనే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. రేపు(జనవరి 25వ తేదీన) హైదరాబాద్‌లో గ్రాండ్ సెలబ్రేషన్స్ చేయబోతున్నట్లు కూడా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.310 కోట్ల పైనే వసూలు చేసిందంటూ ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కెరియర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటించగా, విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. చిరంజీవి వింటేజ్ స్క్రీన్ ప్రెజెన్స్, అనిల్ రావిపూడి(డైరెక్టర్) మ్యాజిక్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ చిత్రాన్ని చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల, సాహు గారపాటి కలసి నిర్మించారు.






