ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతున్న ‘ఛాంపియన్’.. ఎక్కడ చూడొచ్చంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-24 06:11:39  IST  )

టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక(Roshan Meka), ‘పెళ్లి సందడి’ వంటి హిట్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛాంపియన్’ (Champion).

ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతున్న ‘ఛాంపియన్’.. ఎక్కడ చూడొచ్చంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక(Roshan Meka), ‘పెళ్లి సందడి’ వంటి హిట్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛాంపియన్’ (Champion). పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం, గతేడాది డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదలైంది. నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రదీప్ అద్వైతం(Pradeep Advaitam) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, రోషన్ నటనకు సినిమాలోని ఎమోషన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు నెల రోజుల తర్వాత ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా, ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ.. ఓ పోస్ట్ పెట్టారు.

జనవరి 29 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలిపారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి అందుబాటులోకి రానుంది. అయితే హిందీ వెర్షన్ మాత్రం కొంచెం ఆలస్యంగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా..ఈ సినిమాలో రోషన్ సరసన అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించగా.. అర్చన, నరేష్, కోవై సరళ, వెన్నేల కిశోర్ వంటివారు కీలక పాత్రలు పోషించారు. స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్లు ఈ సినిమాను నిర్మించాయి. ఒక యంగ్ బాక్సర్ తన లక్ష్యం కోసం చేసే పోరాటాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ చిత్రాన్ని థియేటర్లో మిస్ అయిన వారు, ఇప్పుడు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

Next Story