రాష్ట్రంలో 16 మంది అధికారులకు IAS హోదా.. గెజిట్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-21 12:52:13  IST  )

తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీస్ (SCS) అధికారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.

రాష్ట్రంలో 16 మంది అధికారులకు IAS హోదా.. గెజిట్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీస్ (SCS) అధికారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వివిధ కేటగిరీల కింద ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ మొత్తం 16 మంది అధికారులకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) హోదా కల్పిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (DoPT) ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది, ఇందులో 2022, 2023, 2024 సంవత్సరాలకు సంబంధించి ఎంపిక చేసిన అధికారులను తెలంగాణ క్యాడర్‌కు కేటాయిస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ఎంపికైన అధికారుల సెలక్షన్ లిస్ట్ -2022లో డి. మధుసూదన్ నాయక్, ఎం.సత్యవాణి, జె.భవానీ శంకర్, జి.లింగయ్య నాయక్, ఎ. నరసింహా రెడ్డిచ, జి. వీరారెడ్డి, జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్, యు.రఘురామ్ శర్మ, పి.చంద్రయ్య, జి.ముకుంద రెడ్డి, ఎ.భాస్కర్ రావు ఉన్నారు. ఇక సెలక్షన్ లిస్ట్‌-2023లో వై.వి.గణేష్, అబ్దుల్ హమీద్, బి.వెంకటేశ్వర్లు ఉన్నారు. సెలెక్ట్ లిస్ట్-2024లో ఎన్.ఖీమ్యా నాయక్, కె.గంగాధర్‌ ఉన్నారు. అయితే, ఈ నియామకాలు తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్ (WP No. 32415/2023)‌ తుది తీర్పునకు లోబడి ఉంటాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సుదీర్ఘ కాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర సివిల్ సర్వీస్ అధికారులకు ఈ నిర్ణయంతో భారీ ఊరట లభించింది.

Next Story