Shocking: హైదరాబాద్ అపార్ట్‌మెంట్‌లో గంజాయి సాగు

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-02 17:17:26  IST  )

హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన వెలుగుజూసింది.

Shocking: హైదరాబాద్ అపార్ట్‌మెంట్‌లో గంజాయి సాగు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)లో షాకింగ్ ఘటన వెలుగుజూసింది. గంజాయి(Cannabis)కి అలవాటు పడిన ఇద్దరు యువకులు ఏకంగా ఇంట్లోనే సాగు చేశాడు. ఆన్‌లైన్‌లో విత్తనాలు కొని అపార్ట్‌మెంట్‌‌లోని పూల కుండీల్లో సాగు చేశారు. సోమవారం టాస్క్‌ఫోర్స్ అధికారుల దాడుల్లో 12 గ్రాముల గంజాయి లభ్యమైంది. నిందితులు ధ్రువ్ ఠాకూర్(ఢిల్లీ), అర్పిత్ స్టీఫెన్‌ ప్రకాశ్(యూపీ)లను అరెస్ట్ చేశారు. ఏ ఏరియాలో అనే వివరాలు ఇంకా వెల్లడించలేదు.

మరోవైపు ఇలాంటి ఘటనే ఇటీవల సంగారెడ్డిలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఏకంగా ఆలయ ప్రాంగణాన్నే గంజాయి తోటగా మార్చేశాడు ఓ పూజారి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగాం గ్రామంలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామంలోని ఆలయంలో పూజారిగా, ఆధ్యాత్మిక గురువుగా చలామణి అవుతున్న అవుటి నాగయ్య , భక్తి ముసుగులో గంజాయి సాగు చేస్తూ ఎక్సైజ్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఇది మరువకముందే హైదరాబాద్‌లో గంజాయి సాగు వార్త కలకలం రేపుతోంది.

Next Story