మెత్తటి మాటలతో సరిపుచ్చడం హాస్యాస్పదం: ఎమ్మెల్సీ

by Gantepaka Srikanth |

ఆంధ్రజ్యోతి కథనాలపై సిట్ వేసి విచారణ జరిపించే దమ్ము సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్నదా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు.

మెత్తటి మాటలతో సరిపుచ్చడం హాస్యాస్పదం: ఎమ్మెల్సీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రజ్యోతి కథనాలపై సిట్ వేసి విచారణ జరిపించే దమ్ము సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్నదా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. సీఎంకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఎన్టీవీలో ప్రసారమైన కథనాలపై విచారణకు సిట్ ఎలా అయితే నియమించారో.. అదేవిధంగా వేమూరి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనాలపైనా తక్షణమే సిట్ వేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీఎంకు రాధాకృష్ణతో ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందేనని.. ఆయన పుట్టినరోజున స్వయంగా ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపే ముఖ్యమంత్రి.. వార్త రాసే ముందు తనను వివరణ అడగాలని మెత్తటి మాటలతో సరిపుచ్చడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే మాటలకే పరిమితం కాకుండా, వెంటనే సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలను నిగ్గుతేల్చాలని పేర్కొన్నారు. చట్టప్రకారం దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Next Story