- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనకాపల్లిలో 'సిరివెన్నెల' కాంస్య విగ్రహావిష్కరణ
తెలుగు సినీ సాహిత్య రంగంలో తనదైన ముద్రను వేసిన సాహిత్య శిఖరం, పద్మశ్రీ డాక్టర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి స్మృత్యర్థం కాంస్య విగ్రహాన్ని ఘనంగా తయారు చేపించారు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినీ సాహిత్య రంగంలో తనదైన ముద్రను వేసిన సాహిత్య శిఖరం, పద్మశ్రీ డాక్టర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry) స్మృత్యర్థం కాంస్య విగ్రహాన్ని (Bronze statue) తయారు చేపించారు. దీనిని అనకాపల్లిలో ఆదివారం సాయంత్రం ఘనంగా ఆవిష్కరించారు. తానా (TANA) సాహిత్య విభాగం - ప్రపంచ సాహిత్య వేదిక, అనకాపల్లి సిరివెన్నెల కళాపీఠం సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. గాంధీనగర్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ప్రముఖ చలనచిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. అలాగే మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో సిరివెన్నెల కుటుంబ సభ్యులు, పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. అక్షరంతో అనంతమైన లోకాన్ని చూపించిన గొప్ప వ్యక్తి సిరివెన్నెల అని, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమని కొనియాడారు. 1955లో అనకాపల్లిలో జన్మించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సాహిత్య లోకంలో ఒక అరుదైన శిఖరం గా ఎదిగారు. 1986లో దర్శకేంద్రుడు కె. విశ్వనాథ్ తెరకెక్కించిన 'సిరివెన్నెల' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ సినిమాలోని అద్భుతమైన సాహిత్యం ఆయనకు ఇంటి పేరుగా 'సిరివెన్నెల'ను స్థిరపరిచింది. సుమారు మూడు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 3000 కు పైగా పాటలు రాశారు. గీత రచయితగా ఏకంగా 11 సార్లు నంది అవార్డులు అందుకున్నారు. అలాగే భారత ప్రభుత్వం నుంచి 2019లో 'పద్మశ్రీ' పురస్కారాన్ని అందుకున్న ఆయన 2021 నవంబర్ 30 న తుదిశ్వాస విడిచారు.






