- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Brahmamudi : సీతారామయ్యతో గొడవ పెట్టుకున్న ధాన్యలక్ష్మీ
బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
రాహుల్, రాజ్ తప్ప.. అందరూ హాల్లోనే కూర్చొని ఉంటారు. " ఈ ఇంట్లో నేను ఏం మాట్లాడినా మీకు తప్పుగానే ఉంటుందని తెలుసు. కానీ, వాడికీ నేను కన్నతల్లిని .. వాడు పడుతున్న కష్టాలు చూసి నా నోటి నుంచి వస్తున్న మాటలు. ఆలోచిస్తాను అని మీరు చెప్పారు కాబట్టే ఇన్ని రోజులు ఆగాను. మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు మావయ్యగారు?’ అని ధాన్యం గట్టిగా అడుగుతుంది. ఇక, అప్పుడే రాజ్ కూడా మెట్లు దిగి కిందకి వస్తాడు.
సీతారామయ్య బాధపడుతూ " ఈ ఇంటిని ముక్కలు చేసి నేను ఉండగలనా అంటూ ఆలోచిస్తున్నాను’ అనే చెట్టు, కొమ్మలు అంటూ భారీ డైలాగ్స్ ఎత్తుతూ ఎమోషనల్ అవుతాడు. ' ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. పరిష్కారం చూపించాలన్నా వందేళ్ల చరిత్రను చూడాలి. కాస్త టైం కావాలని మాత్రం అడగాలనుకుంటున్నాను’ అని సీతారామయ్య అంటాడు. ఇక ధాన్యం రెచ్చిపోతుంది. ‘ ఇంకా ఎంత సమయం కావాలి మావయ్యగారు.. ఎంత సమయం చెప్పండి ? మీరు సమయం అడగారంటే ఏదైనా జరగొచ్చు అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.






