- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ 'వికసిత కేరళం' మేనిఫెస్టో విడుదల.. వరాల జల్లు కురిపించిన నితిన్ నబీన్
కేరళలో బీజేపీ 'వికసిత కేరళం' మేనిఫెస్టో: ఏటా 2 ఉచిత గ్యాస్ సిలిండర్లు, నెలకు 20వేల లీటర్ల ఉచిత నీరు. ఆదాయ పరిమితి రూ. 8 లక్షలకు పెంపు.

దిశ, వెబ్ డెస్క్: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ ప్రచారం (BJP Campaign)లో వేగం పెంచింది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabeen) మంగళవారం ఎన్డీయే ఎన్నికల మేనిఫెస్టో (Election manifesto) 'వికసిత కేరళం విజన్ 2026'ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మేనిఫెస్టోలో పేద, మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకునేలా భారీ హామీలు ప్రకటించారు. ముఖ్యంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి రెండు ఉచిత ఎల్‌పీజీ (LPG) సిలిండర్లు అందిస్తామని, వీటిని రాష్ట్రంలో ప్రధాన పండుగలైన ఓనం, క్రిస్మస్ సమయాల్లో పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) అభ్యున్నతి కోసం వారి వార్షిక ఆదాయ పరిమితిని ప్రస్తుతం ఉన్న దాని నుంచి రూ. 8 లక్షలకు పెంచుతామని నితిన్ నబీన్ స్పష్టం చేశారు. పేద మహిళల కోసం 'భక్ష్య ఆరోగ్య సురక్ష' కార్డు ద్వారా నెలకు రూ. 2,500 రీఛార్జ్, అర్హులైన మహిళలు, 70 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ. 3,000 పెన్షన్ వంటి ఇతర సంక్షేమ పథకాలను కూడా మేనిఫెస్టోలో పొందుపరిచారు. రాష్ట్రంలో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టిన ఆయన, తమకు అవకాశం ఇస్తే కేరళను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి 'వికసిత కేరళంగా మారుస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు.






