- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్.. పూర్తి షెడ్యూల్ ఇదే
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తనదైన శైలిలో రాజకీయ వ్యూహాలను నడిపి ఎన్డీయే కూటమిని నితిన్ నబిన్ భారీ మెజార్టీతో గెలిపించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తనదైన శైలిలో రాజకీయ వ్యూహాలను నడిపి ఎన్డీయే కూటమిని నితిన్ నబిన్ భారీ మెజార్టీతో గెలిపించిన విషయం తెలిసిందే. ఈ భారీ విజయం తర్వాత పార్టీ నాయకత్వం ఆయనను గుర్తించి కేవలం 45 ఏళ్ల వయస్సులోనే.. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ (BJP)కి జాతీయ అధ్యక్షుడిని చేసింది. ఈ ఎన్నిక తర్వాత జాతీయ అధ్యక్షుడి హోదాలో నితిన్ నబిన్ తొలిసారి తెలంగాణకు రానున్నారు. ఈ క్రమంలో ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ బీజేపీ ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా ఆయన మహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం నిర్వహించనున్న 'బూత్ కార్యకర్తల సమ్మేళనం'లో పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
నితిన్ నబిన్ పర్యటన షెడ్యూల్ వివరాలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ రోజు ఉదయం 10:45 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:00 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడ పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి, మధ్యాహ్నం 3:00 గంటలకు మహబూబ్‌నగర్‌లోని MVS డిగ్రీ కళాశాల మైదానానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3:00 నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు MVS డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగ సమావేశంలో ఆయన ప్రసంగిస్తారు. సాయంత్రం 4:15 గంటలకు మహబూబ్‌నగర్ నుండి బయలుదేరి, సాయంత్రం 5:45 గంటలకు తిరిగి శంషాబాద్ చేరుకుంటారు. రాత్రి 6:35 గంటలకు ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని బీజేపీ షెడ్యూల్ ప్రకటించింది.
భారీ భద్రత
బీజేపీ జాతీయ అధ్యక్షుడు కావడంతో నితిన్ నబిన్ కి 'Z' కేటగిరీ భద్రత ఉంది. దీంతో ఆయన రాష్ట్రానికి వస్తుండటంతో CRPF సెక్యూరిటీ కవర్‌తో పాటు తెలంగాణ పోలీసులు పర్యటన అంతటా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. కేంద్ర హోం శాఖ (MHA) నిబంధనల ప్రకారం భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులు ఆదేశించారు. ఈ పర్యటన ద్వారా రాబోయే రాజకీయ సవాళ్లకు తెలంగాణ బీజేపీ శ్రేణులను సమాయత్తం చేయడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేసే దిశగా పార్టీ శ్రేణులకు ఆయన దిశ నిర్దేశం చేయనున్నట్లు సమాచారం.






