రిపబ్లిక్ డే రోజున ఉలిక్కిపడ్డ బీజాపూర్.. భారీ పేలుళ్లలో 11 మంది జవాన్లకు గాయాలు

by Malleboina Mahesh |

గణతంత్ర వేడుకల వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భారీ పేలుళ్లకారణంగా.. జవాన్లకు తీవ్ర గాయాలు అయిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

రిపబ్లిక్ డే రోజున ఉలిక్కిపడ్డ బీజాపూర్.. భారీ పేలుళ్లలో 11 మంది జవాన్లకు గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: గణతంత్ర వేడుకల వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భారీ పేలుళ్ల (Massive explosions) కారణంగా.. జవాన్లకు తీవ్ర గాయాలు అయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని కర్రెగుట్ట కొండల (Karregutta Hills) ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు (IEDs) పేలడంతో భద్రతా దళాలకు చెందిన 11 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుళ్లు జరిగిన వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారులు, క్షతగాత్రులను యుద్ధ ప్రాతిపదికన తరలించి, మెరుగైన చికిత్స నిమిత్తం హెలికాప్టర్ ద్వారా రాయ్‌పూర్‌కు తరలించారు.

ప్రస్తుతం రాయ్‌పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 11 మంది జవాన్ల ఆరోగ్యం నిలకడగానే ఉందని బీజాపూర్ పోలీసులు (Bijapur Police) అధికారికంగా వెల్లడించారు. దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్న సమయంలో ఇలాంటి షాకింగ్ ఘటన ఎదురవ్వడం ఆందోళన కలిగించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కాగా ఈ పేలుడు ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది.

Next Story