BB Telugu 8: ‘సండే.. ఫన్ డే’ మరో కొత్త టాస్క్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న కంటెస్టెంట్లు..!!

by Kodari Anjali |

ప్రస్తుతం మంచి రేటింగ్‌తో దూసుకుపోతుంది తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-8.

BB Telugu 8: ‘సండే.. ఫన్ డే’ మరో కొత్త టాస్క్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న కంటెస్టెంట్లు..!!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం మంచి రేటింగ్‌తో దూసుకుపోతుంది తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-8 (Bigg Boss Season 8). ప్రస్తుతం మంచి రేటింగ్‌తో దూసుకుపోతుంది తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-8.బుల్లితెర ప్రేక్షకుల్ని ఎప్పటికప్పుడు ఎంటర్‌టైన్ చేస్తూ మంచి టీఆర్ఫీ రేటింగ్ (TRF rating) దక్కించుకుంటోంది. ఈ షో విజయవంతంగా ఏడు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ఎనిమిదో సీజన్ రసవత్తంగా సాగుతోంది. బిగ్‌బాస్ సీజన్-8 ఇప్పుడు తొమ్మిదవ వారం కంప్లీట్ చేసుకోబోతుంది. ఈ వారం నయని పావని (Nayani Pavani) ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు కుదిపేయగా.. అధికారికంగా ప్రకటించేవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక నేడు ఆదివారం కాబట్టి.. సన్ డే ఫన్ డే(Sunday fun day) అని ఒక కొత్త టాస్క్ నిర్వహించేందుకు నాగార్జున(Nagarjuna) ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తాజాగా విడుదలైన ప్రోమో చూసినట్లైతే.. నాగ్ లెహరాయి లెహరాయి అటూ అమ్మాయిల మనసు దోచుకున్నారు. నాగార్జున లుక్‌కు అమ్మాయిలు ఫిదా అయిపోయారనడంలో అతిశయోక్తి లేదు.

ఇక టాస్క్ విషయానికొస్తే.. ముందుగా గంగవ్వ(Gaṅgavva) దగ్గర ఉన్న ఫిష్ బౌల్ లో నుంచి ఒక చీటీ తీయమని చెబుతారు. తర్వాత అందులో ఏముందో చదివి, ఆ సాంగ్ ఏంటో కనిపెట్టాలని నాగార్జున చెబుతాడు. తర్వాత ప్రేరణ(Prēraṇa) చీటీ తీసి మ్యాటర్ చదువుతుంది. పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటించిన ఖుషి(Khushi) మూవీలోని అమ్మాయే సన్నగా అనే సాంగ్ అని కంటెస్టెంట్లు గెస్ చేస్తారు. ఈ పాటకు విష్ణుప్రియ(Vishnu Priya), ప్రేరణ, నయనీ పావనీ(Nayani Pavani) అదిరిపోయే స్టెప్పులేసి ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తారు. తర్వాత గౌతమ్‌కు చీటీ తీసే అవకాశం వస్తుంది. అందులో నీ కాళ్లను పట్టుకు వదలనన్నది చూడే నా మనసు అనే సాంగ్ కనిపెడతారు. దీనికి హరితేజ, గౌతమ్, రోహిణి స్టెప్పులేస్తారు. ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story