Bigg Boss 8 Telugu Promo: ‘అక్క అంటే ప్రాబ్లమ్ ఏంటి’.. గౌతమ్ విషయంలో యష్మీని గట్టిగా ప్రశ్నించిన నాగార్జున..!!

by Kodari Anjali |   (  Updated:2025-08-03 10:33:00  IST  )

బిగ్‌బాస్ సీజన్-8 (Bigg Boss Season-8) రోజు రోజుకు రసవత్తంగా సాగుతోంది.

Bigg Boss 8 Telugu Promo: ‘అక్క అంటే ప్రాబ్లమ్ ఏంటి’.. గౌతమ్ విషయంలో యష్మీని గట్టిగా ప్రశ్నించిన నాగార్జున..!!
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ సీజన్-8 (Bigg Boss Season-8) రోజు రోజుకు రసవత్తంగా సాగుతోంది. వైల్డ్ కార్డు(wild card) ఎంట్రీ ఇచ్చాక.. రెండు గ్రూపులుగా ఉన్న కంటెస్టెంట్లు(Contestants) ప్రస్తుతం అందరూ కలిసిపోయారు. రీసెంట్ గా నాలుగు టీమ్స్ గా డివైడై.. బీబీ ఇంటికి దారేది(Bibi went home) అనే టాస్క్ ఆడారు కంటెస్టెంట్లు. దీంతో కంటెస్టెంట్ల మధ్య బాగానే గొడవలు జరిగాయి. వీరి మధ్య స్నేహం పక్కనపెట్టి.. కోపంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకున్నారు. దీంతో బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న నాగార్జున ఫుల్ ఫైర్ అయ్యారు. అలాగే గౌతమ్ తో ఇతరులకు జరిగిన వివాదాల గురించి మాట్లాడారు. యష్మీ(Yashmi) ప్రాబ్లమ్ ఏంటి? అని నాగ్ డైరెక్ట్‌గా అడిగేశారు. కొత్తగా రెండు బూతు పదాలు తెలుసుకున్నానని.. అక్క, బ్రదర్ అని నాగార్జున చెబుతూ యష్మీని లేవమన్నారు.

నిన్ను అక్క అని పిలిస్తే ఏమవుతుందని అడిగారు. దీనికి యష్మ బదులిస్తూ.. ‘నేను అంటే క్రష్ అని చెప్పి.. అక్క అని పిలిచేసరికి తీసుకోలేకపోయాను’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే నామినేషన్స్ గురించి నాగ్ మాట్లాడారు. గౌతమ్(Gautham).. విష్ణుప్రియ(Vishnu Priya)తో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నువ్వు ఎందుకు కల్పించుకున్నావు. అని అన్నారు. వారు చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడితే బాగుండేదేమో.. అందుకే అక్క అంటూ నీపై ఫైర్ అయ్యారంటూ నాగార్జున అన్నారు. తర్వాత నామినేషన్స్(Nominations) లో యష్మీ అండ్ గౌతమ్ మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియోను ప్లే చేశారు. అందులో యష్మీ కూడా తిరిగి గౌతమ్ ను తమ్ముడు అన్నది. నువ్వు ఎందుకు అక్క అనగానే వెంటనే తమ్ముడు అన్నావని నాగ్ యష్మీని క్వశ్చన్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Video Link..

Next Story