- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరో విజయ్ 'జన నాయగన్' సినిమాకు మరో షాక్.. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన మద్రాసు హైకోర్టు
తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jananayagan) వివాదంలో మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

దిశ, వెబ్ డెస్క్: తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jananayagan) సినిమాకు మరోసారి షాక్ తగిలింది. ఈ సినిమా వివాదంలో మద్రాసు హైకోర్టు (Madras High Court) కీలక తీర్పు వెలువరించింది. సెన్సార్ సర్టిఫికేషన్, విడుదలకు సంబంధించి గతంలో సింగిల్ బెంచ్ (Single Bench) ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. దీంతో విజయ్ కథానాయకుడిగా నటించిన రాజకీయ యాక్షన్ చిత్రం 'జననాయగన్' విడుదలకు అడ్డంకులు కొనసాగుతున్నాయి. గతంలో సింగిల్ బెంచ్.. సినిమాలోని కొన్ని సన్నివేశాలు, సంభాషణలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ U/A సర్టిఫికేట్ ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెన్సార్ బోర్డు హైకోర్టును ఆశ్రయించింది. అనంతరం పూర్తి వాదనలు విన్న హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సెన్సార్ బోర్డు (CBFC) తన వాదనలను వినిపిస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు తగిన సమయం ఇవ్వకుండానే సింగిల్ బెంచ్ మెరిట్స్ ఆధారంగా తీర్పునివ్వడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు కేసును తిరిగి విచారించాలని సింగిల్ జడ్జికి పంపిస్తూ (Remand), నిర్మాతలకు తమ అభ్యర్థనలో (Writ Petition) సవరణలు చేసుకునే వెసులుబాటును కల్పించింది.
మళ్ళీ మొదటికి సెన్సార్ వివాదం.. విడుదలపై కొనసాగుతున్న ఉత్కంఠ
ఈ వివాదంపై సెన్సార్ బోర్డు తరపు అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదిస్తూ.. చిత్ర పరీక్షా కమిటీ (Examining Committee) సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపాలని జనవరి 5న సెన్సార్ బోర్డు చైర్మన్ నిర్ణయించారని కోర్టుకు తెలిపారు. ఆ నిర్ణయాన్ని సవాలు చేయకుండా నేరుగా సర్టిఫికేట్ ఇవ్వాలని కోరడం సరికాదని వాదించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జనవరి 20న విచారణ జరిపిన హైకోర్టు, నేడు ఈ తీర్పును వెలువరించింది. ఈ నిర్ణయంతో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ భారీ చిత్రం విడుదల మరింత ఆలస్యం కానుంది. పూజా హెగ్డే, బాబీ డియోల్ వంటి ప్రముఖ తారాగణం ఉన్న ఈ సినిమాపై విజయ్ రాజకీయ అరంగేట్రం నేపథ్యంలో భారీ అంచనాలు నెలకొన్నాయి






