- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ICC Men's T20 World Cup : చివరి ప్రయత్నంలోను బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్
త్వరలో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌లో భద్రతా కారణాల దృష్ట్యా తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలన్న BCB విజ్ఞప్తిని ఐసీసీ బోర్డు ఇప్పటికే 14-2 ఓట్ల తేడాతో తిరస్కరించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: త్వరలో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌లో భద్రతా కారణాల దృష్ట్యా తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలన్న BCB విజ్ఞప్తిని ఐసీసీ బోర్డు ఇప్పటికే 14-2 ఓట్ల తేడాతో తిరస్కరించిన విషయం తెలిసిందే. భారతదేశంలో టీ20 ప్రపంచకప్ ఆడే ప్రసక్తే లేదని భీష్మించుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు (BCB) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కోలుకోలేని దెబ్బ కొట్టింది. అనంతరం బంగ్లాదేశ్ చివరి ప్రయత్నంగా.. ఐసీసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నిన్న ఐసీసీ వివాద పరిష్కార కమిటీని (DRC) ఆశ్రయించింది. కానీ అక్కడ కూడా బంగ్లాదేశ్‌కు తీవ్ర పరాభవం ఎదురైంది. ఐసీసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష చేసే అధికారం తమకు లేదని, ఈ అప్పీల్ తమ పరిధిలోకి రాదని DRC స్పష్టం చేస్తూ బంగ్లాదేశ్ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
స్వతంత్ర భద్రతా సంస్థల నివేదికల ప్రకారం భారత్‌లో ఆటగాళ్లకు ఎలాంటి ముప్పు లేదని ఐసీసీ మరోసారి తేల్చి చెప్పింది. బంగ్లాదేశ్ తన మంకుపట్టు వీడకపోవడంతో ఐసీసీ ఇప్పుడు కఠిన చర్యలకు సిద్ధమైంది. టోర్నీ ప్రారంభానికి కేవలం రెండు వారాలే సమయం ఉండటంతో, బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను ఎంపిక చేసే ప్రక్రియను ఐసీసీ దాదాపు పూర్తి చేసింది. ర్యాంకింగ్స్ ప్రకారం అర్హత పొందే అవకాశం ఉన్న స్కాట్లాండ్‌ను గ్రూప్-సి లో చేర్చుతూ నేడు అధికారిక ప్రకటన వెలువడే ఛాన్సుంది. ఈ వివాదం వల్ల బంగ్లాదేశ్ కేవలం మెగా టోర్నీని కోల్పోవడమే కాకుండా, ఐసీసీ నుంచి వచ్చే దాదాపు రూ. 240 కోట్ల భారీ నిధులను కూడా వదులుకోవాల్సి వస్తుంది. ఇది ఆ దేశ క్రికెట్ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.






