తెలంగాణ గురుకుల విద్యార్థులకు బిగ్ అలర్ట్

by Gantepaka Srikanth |

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశానికి దాదాపు ఒక లక్షా 80వేల అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు.

తెలంగాణ గురుకుల విద్యార్థులకు బిగ్ అలర్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశానికి దాదాపు ఒక లక్షా 80వేల అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ విద్యాలయాల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్‌కి ఇది వరకు జనవరి 21 ఉన్న చివరి తేదీని తల్లి దండ్రుల విజ్ఞప్తుల మేరకు ఈనెల 25కి అధికారులు పొడగించారు. దీనితో ప్రవేశానికి చివర తేదీ ఆదివారంతో ముగిసింది. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకూ ఉన్న సీట్లు ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా భర్తీ చేస్తారు. గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఎంట్రెన్స్ టెస్ట్ ని ఫిబ్రవరి 22న నిర్వహించనున్నారు. కాగా, ప్రవేశానికి చివరి తేదీని మరోసారి పెంచే అవకాశం లేదని అధికార వర్గాలు తెలిపాయి.

Next Story