వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపటి నుంచి టోల్ ప్లాజాల వద్ద కొత్త రూల్స్

by Malleboina Mahesh |

హైవేలపై రేపటి నుంచి కొత్త రూల్! టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు పూర్తిగా నిలిపివేత. ఇకపై ఫాస్టాగ్, యూపీఐ ద్వారానే టోల్ రుసుము చెల్లించాలి.

వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపటి నుంచి టోల్ ప్లాజాల వద్ద కొత్త రూల్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశంలో అనేక కొత్త రూల్స్ (New Rules) అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) హైవే వినియోగదారుల కోసం కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి (ఏప్రిల్ 1, 2026) దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాల (Toll plazas) వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది. టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీని తగ్గించడానికి, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఫాస్టాగ్ లేని వారు నగదు రూపంలో రెట్టింపు టోల్ చెల్లించి వెళ్లే వెసులుబాటు ఉండేది.. కానీ రేపటి నుంచి ఆ విధానానికి స్వస్తి పలకనున్నారు.

ఇకపై టోల్ రుసుములను కేవలం ఫాస్టాగ్ (FASTag), యూపీఐ (UPI) ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఫాస్టాగ్ పని చేయకపోయినా లేదా బ్యాలెన్స్ లేకపోయినా, వాహనదారులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ ద్వారా తక్షణమే చెల్లింపులు చేయవచ్చు. నగదు లావాదేవీల వల్ల జరుగుతున్న జాప్యాన్ని నివారించి, డిజిటల్ చెల్లింపులను 100 శాతం అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ మార్పులు చేపట్టింది. వాహనదారులు ప్రయాణానికి ముందే తమ ఫాస్టాగ్ వాలెట్‌ను రీఛార్జ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Next Story