- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు బ్యాంకు ఉద్యోగుల సమ్మె
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు నేడు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఒక్కరోజు సమ్మెకు దిగనున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు నేడు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఒక్కరోజు సమ్మెకు దిగనున్నారు. వారానికి ఐదు రోజుల పని వారం (5 డే వర్క్ వీక్) అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ సమ్మె జరుగుతోంది. ఇప్పటికే జనవరి 25 ఆదివారం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం సెలవులు కావడంతో, ఈరోజు కూడా సమ్మె జరిగితే వరుసగా మూడు రోజులు బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయి. ఈ సమ్మె ప్రభావంతో ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ వంటి పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు పూర్తిగా మూసివేయబడతాయి. అలాగే డిపాజిట్లు, విత్ డ్రా వంటి లావాదేవీలు జరగవు.
ప్రైవేట్ బ్యాంకులు పూర్తిగా మూసివేయకపోయినా, సిబ్బంది కొరత కారణంగా కొన్ని శాఖల్లో సేవలు పరిమితంగానే ఉండవచ్చు. అయితే నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి మొబైల్ యాప్‌లు పనిచేస్తాయి. కానీ చెక్ క్లియరెన్స్, క్యాష్ డిపాజిట్ వంటి శాఖల లావాదేవీలు ఆలస్యం కానున్నాయి. అలాగే ఏటీఎంలలో డబ్బు రీలోడ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. 2015 నుంచి బ్యాంకు యూనియన్లు అన్ని శనివారాలకు సెలవుతో కూడిన ఐదు రోజుల పని వారం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇతర దేశాల్లో ఇది ఇప్పటికే అమల్లో ఉండటంతో, భారతదేశంలో కూడా ఉద్యోగులకు వర్క్–లైఫ్ బ్యాలెన్స్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. గతంలో జరిగిన చర్చలు ఫలితం ఇవ్వకపోవడంతో సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఖాతాదారులు డిజిటల్ లావాదేవీలపై ఆధారపడాలని, బ్యాంకు శాఖలకు సంబంధించిన పనులు కొంత ఆలస్యం కావచ్చని ముందే తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.






