చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. వెస్టిండీస్ గడ్డపై..

by Vinod kumar |

దిశ, వెబ్‌డెస్క్ : వెస్టిండీస్ గడ్డపై మూడు వన్డేల సిరీస్‌లో - Bangladesh defeat West Indies by 9 wickets to clinch one day international series

చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. వెస్టిండీస్ గడ్డపై..
X

దిశ, వెబ్‌డెస్క్ : వెస్టిండీస్ గడ్డపై మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో గెలిచి.. బంగ్లాదేశ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. వెస్టిండీస్‌లో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. మెుదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 35 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. వెస్టిండీస్‌ కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ డకౌట్‌కాగా.. కీమో పాల్‌ 25- నాటౌట్‌ మినహా ఎవరూ కూడా రాణించలేకపోయారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహెదీ హసన్‌ 4 వికెట్లు తీయగా.. నాసుమ్‌ అహ్మద్‌ 3 వికెట్లు పడగొట్టాడు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ జట్టు ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ అర్థ శతకంతో రాణించి సత్తా చాటాడు. 20.4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 112 పరుగులు చేసిన బంగ్లాదేశ్‌ భారీ విజయం సాధించింది. నాసుమ్‌ అహ్మద్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.


Next Story