మూట ముల్లె సర్దుకుని కరీంనగర్ వదిలి వెళ్లిపో.. గంగుల కమలాకర్‌పై బండి సంజయ్ ఫైర్

by Gantepaka Srikanth |

కరీంనగర్‌లో కేంద్రమంత్రి బండి సంజయ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

మూట ముల్లె సర్దుకుని కరీంనగర్ వదిలి వెళ్లిపో.. గంగుల కమలాకర్‌పై బండి సంజయ్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్‌లో కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఇంటిపన్ను పెంపునకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందని అన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలి? అని ప్రశ్నించారు. రెండేళ్లలో మున్సిపాలిటీలు, కరీంనగర్ కార్పొరేషన్‌కు నయాపైసా ఇయ్యలేదని గుర్తుచేశారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే అని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్ఎస్‌కు ఓటు వేసి ఉపయోగం లేదని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, కబ్జాలతో దోచుకుతిన్నారని ఆరోపించారు.

పొరపాటున బీఆర్ఎస్ గెలిస్తే.. కమీషన్ల కోసం కేంద్ర నిధులను దారి మళ్లిస్తుందని అన్నారు. కరీంనగర్‌లో జరిగిన అభివృద్ధి మొత్తం కేంద్రం నిధులతోనే అని చెప్పారు. ‘నేను పైసలు తీసుకొస్తే.. బీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా కొబ్బరికాయ కొట్టి మావేనని చెప్పుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే మరిన్ని నిధులు తెచ్చే బాధ్యత నాది. గంగుల కమలాకర్.. మూట ముల్లె సర్దుకుని కరీంనగర్ వదిలి వెళ్లిపో’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు.

Next Story