Assam Floods: సీఎం హిమంత బిస్వ శర్మ ఏరియల్ సర్వే

by Dishanational1 |
Assam Floods CM Himanta Biswa Sarma Conducts Aerial Survey Of Flood Hit Silchar Town
X

డిస్పూర్: CM Himanta Biswa Sarma Conducts Aerial Survey Of Flood Hit Silchar Town| అసోంలో వరద బీభత్సం కొనసాగుతూనే ఉంది. గురువారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఒక్కరోజులో 12 మరణాలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో మే నుంచి ఇప్పటివరకు వరదలతో సంభవించిన మరణాల సంఖ్య 101కు చేరింది. ఇప్పటివరకు 54.5 లక్షల మంది ప్రభావితం అయ్యారని వెల్లడించారు. బ్రహ్మపుత్ర, బరాక్ నదులతో పాటు ఉపనదులు పొంగడంతో రాష్ట్రంలోని 32 జిల్లాలు ప్రభావితమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇతర సహాయక సిబ్బంది 276 బోట్ల సహాయంతో 3,658 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు నివేదిక పేర్కొంది. మంగళవారం నుంచి 207 మంది సిబ్బందితో ఇతర బెటాలియన్ల నుంచి అదనంగా ఎనిమిది బృందాలను సిల్చార్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు. అయితే కొప్లి నదీ ప్రవాహా తీవ్రత ఎక్కువగా ఉందని సీడబ్ల్యూసీ నివేదిక పేర్కొంది. సిల్చార్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం హిమంత బిశ్వ శర్మ హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను కలిసి, అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, ఇతర అత్యవసరాలు అందిచేలా ఏర్పాట్లు చేశారు. వరదల కారణంగా జూన్ 25న ప్రారంభం కావాల్సిన పాఠశాలలు, జూలై 25కు వాయిదా పడ్డాయి.

Next Story

Most Viewed