- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ నెక్స్ట్ సీఎం నారా లోకేష్.. వర్మ సంచలన వ్యాఖ్యలు
నారా లోకేష్ తదుపరి సీఎం కావాలని వర్మ సంచలన వ్యాఖ్యలు! యువగళంతో పార్టీని గెలిపించిన నేత అంటూ ప్రశంసలు. పవన్ కళ్యాణ్‌పై పరోక్ష విమర్శలేనా?

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ యువనేత, మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడానికి అన్ని విధాలా అర్హుడని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ (Former MLA Verma) సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కన్నా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి అర్హుడైన మరో నాయకుడు ఎవరు ఉన్నారంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు. గత ఎన్నికల్లో 'యువగళం' పాదయాత్ర ద్వారా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు పర్యటించి, కుప్పకూలిన స్థితిలో ఉన్న టీడీపీని మళ్ళీ నిలబెట్టి అధికారంలోకి తీసుకురావడంలో లోకేష్ పాత్ర వెలకట్టలేనిదని వర్మ కొనియాడారు.
కేవలం రాజకీయాలే కాకుండా, పార్టీ కోసం ప్రాణాలర్పించిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడానికి 'కార్యకర్తల సంక్షేమ నిధి' ని ఏర్పాటు చేసి, వారికి అండగా నిలిచిన గొప్ప నాయకుడు లోకేష్ అని వర్మ ప్రశంసించారు. అయితే, ఇదే సమయంలో వర్మ చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్‌తో పాటు, ఆయనను భవిష్యత్తు ముఖ్యమంత్రిగా అభివర్ణించడం.. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేసినవేనని రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కూటమిలో లోకేష్ ప్రాధాన్యతను పెంచేలా వర్మ చేస్తున్న ఈ వ్యాఖ్యలపై జనసేన మరియు ఇతర పార్టీల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.






