ఏపీ జంగిల్ రాజ్‌గా మారింది.. ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-28 10:11:21  IST  )

ఆంధ్రప్రదేశ్ జంగిల్ రాజ్‌గా మారిందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.

ఏపీ జంగిల్ రాజ్‌గా మారింది.. ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) జంగిల్ రాజ్‌గా మారిందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ధ్వజమెత్తారు. ఇవాళ భీమవరంలో పార్టీ నేతలతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ మద్యం పాలసీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని అన్నారు. మద్యం షాపులన్నీ చంద్రబాబు (Chandrababu) మనుషులవేనని తెలిపారు. సంక్రాంతి సమయంలో కోడి పందాలకు వేలం నిర్వహించారని ఆరోపించారు. చివరికి తన నియోజకవర్గం పులివెందులలోనూ కోడి పందాలకు వేలం పెట్టారని గుర్తు చేశారు. ప్రభుత్వమే అన్ని దగ్గరుండి చేయిస్తే శాంతిభద్రతలు ఏమవుతాయని ప్రశ్నించారు. బరితెగింపులకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ఏపీ జంగిల్ రాజ్‌గా మారిందని, కూటమి ఎమ్మెల్యేలు దిగజారారని జగన్ అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగినిని రైల్వే కోడూరు ఎమ్మెల్యే వేధించడం సిగ్గుచేటని అన్నారు. ఇక మంత్రి వాసంశెట్టి రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇలా చంద్రబాబు, లోకేశ్ (Lokesh) అండతో ఎమ్మెల్యేలు ఎవరికి వారు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్, కోనేటి ఆదిమూలం కూడా ఇలాగే చేశారని గుర్తు చేశారు. రెండేళ్లలో చంద్రబాబు రూ. 3 లక్షల కోట్లు అప్పు చేశారని.. ఆ డబ్బంతా ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఆదాయమంతా చంద్రబాబు, ఆయన మనుషుల జేబుల్లోకి పోతోందని వైఎస్ జగన్ ఆరోపించారు.

Next Story