- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. 144 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం
భారత రక్షణ రంగ చరిత్రలోనే మరో అతిపెద్ద ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం (Government Of India) ఆమోదం తెలిపింది.

దిశ, వెబ్‌డెస్క్: భారత రక్షణ రంగ చరిత్రలోనే మరో అతిపెద్ద ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం (Government Of India) ఆమోదం తెలిపింది. భారత వైమానిక దళం (IAF) అమ్ములపొదిలో మరిన్ని అత్యాధునిక ‘రాఫెల్’ (Raphael) యుద్ధ విమానాలను చేర్చేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ కీలక అడుగు వేసింది. సుమారు రూ.3.25 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ విమానాల కొనుగోలు ప్రతిపాదనకు ప్రధాన మంత్రి నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) ఆమోద ముద్ర వేసింది. ఈ ఒప్పందంలో భాగంగా మొదటి 12 నుంచి 18 విమానాలను ఫ్రాన్స్ నుంచి నేరుగా దిగుమతి చేసుకోనున్నారు. మిగిలిన విమానాలను భారత్‌లోనే స్వదేశీ కంపెనీల భాగస్వామ్యంతో తయారు చేయనున్నట్లుగా తెలుస్తోంది.
అయితే, విమానాల తయారీలో కనీసం 30 శాతం నుంచి 60 శాతం వరకు స్వదేశీ విడిభాగాలను వాడాలని భారత్ నిబంధన విధించింది. రాఫెల్ సాఫ్ట్‌వేర్ ‘సోర్స్ కోడ్’ను కూడా భారత్ ఇవ్వాలని షరతు విధించింది. రాఫెల్ ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతుల కోసం హైదరాబాద్ (Hyderabad)లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. తాజా పరిణామంతో ఫ్యూచర్‌లో రాఫెల్ విమానాల మెయిన్‌టెన్స్ మరింత సులభం కానుంది. కాగా, ప్రస్తుతం వాయుసేనలో యుద్ధ విమానాల స్క్వాడ్రన్ల సంఖ్య 29కి పడిపోయింది. ప్రస్తుతం లోటును భర్తీ చేసేందుకు ఫ్రాన్స్‌తో 114 కొత్త రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు డీల్‌ను ఖాయం చేసుకున్నారు.






