ఆనంద్ మహింద్రకు ప్రభాస్ డైరెక్టర్ రిక్వెస్ట్..

by Dishafeatures2 |
ఆనంద్ మహింద్రకు ప్రభాస్ డైరెక్టర్ రిక్వెస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆనంద్ మహింద్ర దేశంలోని ప్రముఖ వ్యాపార వేత్త, మహింద్ర గ్రూప్ చైర్మన్‌గా అందరికీ సుపరిచితమే. అయితే తాజాగా మహింద్రను ప్రభాస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ రిక్వెస్ట్ చేశాడు. 'ప్రాజెక్ట్ K మూవీని భారీగా నిర్మిస్తున్నాం. ఈ సినిమా కోసం ప్రతిభావంతులైన భారత ఇంజినీర్లు, డిజైనర్లు ఉన్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం భారీ స్కేల్‌పై జరుగుతోంది. మాకు సహాయం చాలా అవసరం. ఇప్పటి వరకు ఎవ్వరూ ప్రయత్నించని విధంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. మీరు సహాయం చేస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం' అని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశాడు. దీనిపై ఆనంద్ మహింద్ర తాజాగా స్పందించారు. అంతేకాకుండా సహాయం చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు.

'ఇలాంటి అవకాశాన్ని మేము ఎలా వద్దంటాం? మా గ్లోబల్ ప్రొడక్ట్ డెవెలప్‌మెంట్ చీఫ్ వేలు మహింద్ర మీకు సహాయం చేస్తాడు. అతడి భారాన్ని మీపై వేయడం నాకు సంతోషంగా ఉంది. అతడు తాజాగా XUV700 డెవలప్ చేశాడు. అంతేకాకుండా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై కూడా పనులు ప్రారంభించేశాడు‌' అని ఆనంద్ మహింద్ర ట్వీట్ చేశారు. దీంతో ప్రభాస్ ప్రాజెక్ట్K లో భారీ బైక్ స్టంట్స్, ఛేజింగ్ సీన్స్ ఉంటాయని, ఫ్యూచర్ బైక్స్ కూడా ఉంటాయని ఫ్యాన్స్ ఊహాగానాలు చేస్తున్నారు. దాంతో పాటుగా ఈ మూవీలో యాక్షన్‌కు కొదవ ఉండదని, ప్రభాస్ దెబ్బకు బాక్సాఫీస్ తట్టుకోలేదంటూ నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.



Next Story

Most Viewed