- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షూటింగ్ మొదలవ్వకముందే ఆల్ టైమ్ రికార్డ్.. సునామీ సృష్టిస్తున్న బన్నీ-లోకేష్ మూవీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)కలిసి సినిమా చేస్తున్నారంటే అంచనాలు పీక్స్‌లో ఉంటాయి.

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)కలిసి సినిమా చేస్తున్నారంటే అంచనాలు పీక్స్‌లో ఉంటాయి. కానీ ‘AA-23’ విషయంలో ఆ అంచనాలు ఊహకందని స్థాయికి వెళ్ళిపోయాయి. ఇంకా షూటింగ్ కూడా మొదలవ్వకముందే, కేవలం ఒక చిన్న అనౌన్స్‌మెంట్ వీడియోతోనే ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన లోకేష్, స్టైలిష్ స్టార్ బన్నీని ఎలా చూపిస్తారో అన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఏ రేంజ్‌లో ఉందో తాజా రికార్డులే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
ఈ సినిమా ప్రకటన కోసం విడుదల చేసిన గ్లింప్స్ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 3.55 మిలియన్లకు (35 లక్షలకు) పైగా రీల్స్ వచ్చాయి. ఇండియాలో ఒక సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోకు ఈ స్థాయిలో సోషల్ మీడియాలో రీల్స్ రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన పవర్ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ వీడియోను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. ఆ మ్యూజిక్ వింటుంటేనే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తుండటంతో, ప్రతి ఒక్కరూ ఆ ఆడియోను వాడుతూ రీల్స్ చేసేస్తున్నారు. ఈ అరుదైన ఘనతను నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
‘పుష్ప’ లాంటి భారీ హిట్ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం ఒక నిమిషం గ్లింప్స్‌కే ఈ రేంజ్ రెస్పాన్స్ ఉంటే, ఇక ముందుముందు వచ్చే టీజర్, ట్రైలర్ ఇంకెన్ని రికార్డులను సాధిస్తాయో అని నెటిజన్లు అంటున్నారు. లోకేష్ తనదైన ‘సినిమాటిక్ యూనివర్స్’ (LCU) లో బన్నీని కూడా భాగం చేస్తారా? లేక ఇదొక సెపరేట్ సైన్స్ ఫిక్షన్ మూవీనా? అన్న ఉత్కంఠ ఫ్యాన్స్‌లో రోజురోజుకూ పెరిగిపోతోంది. మొత్తానికి షూటింగ్ మొదలవ్వకముందే ‘AA-23’ బాక్సాఫీస్ వద్ద తన వేట మొదలుపెట్టిందని అంతా చర్చించుకుంటున్నారు.






