- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్షయ్ కుమార్ వాహనానికి ప్రమాదం
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ వాహనానికి సోమవారం రాత్రి భారీ ప్రమాదం జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ వాహనానికి సోమవారం రాత్రి భారీ ప్రమాదం జరిగింది. అక్షయ్ కుమార్, ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా విదేశీ పర్యటన నుంచి తిరిగి వస్తుండగా... కాన్వాయ్‌లోని ఒక ఎస్కార్ట్ వాహనానికి ముంబై జుహూ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక మెర్సిడెస్ కారు ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఆ ఆటో అదుపు తప్పి రోడ్డుకు అవతలివైపు ప్రయాణిస్తున్న అక్షయ్ ఎస్కార్ట్ కారును ఢీకొనడంతో, ఆ వాహనం రోడ్డుపై పల్టీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా దెబ్బతినగా, ఆటో డ్రైవర్‌తో పాటు ఒక ప్రయాణికుడికి గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అక్షయ్, ట్వింకిల్ ప్రయాణిస్తున్న మరో SUVకు కూడా స్వల్పంగా దెబ్బ తగిలినప్పటికీ.. వారిద్దరూ సురక్షితంగా ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా అక్షయ్ కుటుంబం సురక్షితంగా ఉండటంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.






