- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. పరిశీలకులను నియమించిన AICC
ఐదు రాష్ట్రాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఐదు రాష్ట్రాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరగనున్న వివిధ రాష్ట్రాలకు సీనియర్ పర్యవేక్షకులను (Observers) నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ (KC Venugopal) ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాల వారీగా నియమితులైన పర్యవేక్షకుల జాబితాలో అస్సాం రాష్ట్ర ఎన్నికల బాధ్యతలను ముగ్గురు కీలక నేతలకు అప్పగించారు. అందులో భూపేష్ బాఘేల్, డీ.కె.శివకుమార్, బంధు తిర్కీ ఉన్నారు.
ఇక కేరళ రాష్ట్రానికి సచిన్ పైలట్, కేజే జార్జ్, ఇమ్రాన్ ప్రతాప్ గర్హి, కన్హయ్యా కుమార్ లాంటి నేతలను అబ్జర్వర్లుగా నియమించారు. అదేవిధంగా తమిళనాడు, పుదుచ్చేరి రెండు ప్రాంతాలకు కలిపి ముకుల్ వాస్నిక్, ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖాజీ మహమ్మద్ నిజాముద్దీన్ లాంటి ముగ్గురు సీనియర్ నేతలను ఎంపిక చేశారు. అత్యంత క్లిష్టమైన పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల పర్యవేక్షణ కోసం సుదీప్ రాయ్ బర్మన్, షకీల్ అహ్మద్ ఖాన్, ప్రకాష్ జోషిలను నియమించారు. కాగా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యూహాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేయడంలో తాజాగా నియమించిన సీనియర్ పర్యవేక్షకులు కీలక పాత్ర పోషించనున్నారు.






