రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. మూడేళ్ల తర్వాత బీజేపీ నేత ఎమ్మెల్యేగా విజయం

by Malleboina Mahesh |   (  Updated:2026-05-03 10:21:34  IST  )

కర్ణాటక శృంగేరిలో బీజేపీ నేత డి.ఎన్. జీవరాజ్ సంచలన విజయం! కోర్టు ఆదేశంతో జరిగిన రీకౌంటింగ్‌లో 2023 ఫలితం తారుమారైంది. 66 ఓట్ల మెజారిటీతో జీవరాజ్ గెలుపొందారు.

రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. మూడేళ్ల తర్వాత బీజేపీ నేత ఎమ్మెల్యేగా విజయం
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక రాజకీయాల్లో ఎవరూ ఊహించని అరుదైన పరిణామం చోటుచేసుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో శృంగేరి నియోజకవర్గం (Sringeri Constituency) నుంచి స్వల్ప తేడాతో ఓటమి పాలైన బీజేపీ అభ్యర్థి డి.ఎన్. జీవరాజ్ (D.N. Jeevaraj), మూడేళ్ల తర్వాత కోర్టు ఆదేశాలతో జరిగిన రీకౌంటింగ్‌లో విజేతగా నిలిచారు. గత ఎన్నికల ఫలితాలపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, పోస్టల్ బ్యాలెట్లను తిరిగి లెక్కించాలని కోర్టు ఆదేశించింది.

2023 లో జరిగిన సాధారణ లెక్కింపులో జీవరాజ్ సుమారు 200 ఓట్ల తేడాతో ఓడిపోగా, తాజా రీకౌంటింగ్‌ (Recounting)లో ఫలితం తారుమారైంది. పోస్టల్ బ్యాలెట్లను తిరిగి లెక్కించగా ఆయన తన ప్రత్యర్థిపై 66 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించినట్లు తేలింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత దక్కిన ఈ విజయం ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో (Karnataka politics) హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే ఓ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడగా.. తాజాగా రీ కౌంటింగ్ తో మరో ఎమ్మెల్యేను కోల్పోయింది. దీంతో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 133 కి పడిపోయింది.

Next Story