యంనంపేటలో సీజ్ చేసిన అపార్ట్మెంట్ లో అదనపు అంతస్తులు

by Ratna Kumari |

మున్సిపల్ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేతలతో పాటు అట్టి నిర్మాణాలను సీజ్ చేస్తామని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఘట్కేసర్ సర్కిల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్(ఏసీపీ) శ్రీధర్ హెచ్చరించారు.

యంనంపేటలో సీజ్ చేసిన అపార్ట్మెంట్ లో అదనపు అంతస్తులు
X

దిశ, ఘట్కేసర్ : మున్సిపల్ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేతలతో పాటు అట్టి నిర్మాణాలను సీజ్ చేస్తామని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఘట్కేసర్ సర్కిల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్(ఏసీపీ) శ్రీధర్ హెచ్చరించారు. శనివారం పోచారం డివిజన్ పరిధిలోని యంనంపేట్, నారపల్లిలో అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం చేయుచున్న వారికి గతంలో నోటీసులు జారీ చేసినా, యజమానులు సెలవు దినాలలో అక్రమ నిర్మాణాలు యధావిధిగా చేపడుతుండడంతో డిప్యూటీ కమిషనర్ వాణి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బంది పోలీసు శాఖ వారి సహాయంతో తొమ్మిది అపార్ట్మెంట్లలో అనుమతి లేకుండా నిర్మించిన అదనపు అంతస్తులను సీజ్ చేశారు. భవన నిర్మాణదారులు అనుమతులకు అనుగుణంగా నిర్మాణం చేసుకోవాలని నిబంధనలను అతిక్రమించినచో చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని ఏసీపీ శ్రీధర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ బి.శ్రీదేవి, పోచారం ఐటీ కారిడార్ పోలీసులు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story