- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sahiti Infra Scam: 360 కోట్ల మోసం జరిగినట్లు ED నిర్ధారణ
సాహితీ ఇన్‌ఫ్రాటెక్ మనీలాండరింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: సాహితీ ఇన్‌ఫ్రాటెక్ మనీలాండరింగ్ కేసు(Sahiti Infratech Money Laundering Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదనపు ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 360 కోట్ల మోసం జరిగినట్లు నిర్ధారించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మించినట్లు గుర్తించారు. రూ.800 కోట్లకు పైగా నిధులు వసూలు చేసి.. రూ.216.91 కోట్ల నగదును విదేశాలకు మళ్లించినట్లు తెలిపారు. రూ.169.15 కోట్ల ఆస్తులు అటాచ్ చేశారు. నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు.
ఆర్థికంగా నష్టపోయిన పేదలు
కాగా, 'ఫ్రీ లాంచ్ ఆఫర్' పేరుతో అతి తక్కువ ధరకు ప్లాట్లు, ఫ్లాట్లు ఇస్తామంటూ వేలాది మంది కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశారు సాహితీ యాజమాన్యం. ఈ కేసులో మొత్తం 64 కేసులు నమోదయ్యాయి. ఈ స్కామ్ వల్ల వేలాది మంది మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయి. బాధితులు గతంలో ధర్నాలు, నిరసనలు చేశారు. ప్రస్తుతం ఈ కేసును ఈడీ అధికారులు విచారిస్తున్నారు.






